వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్ స‌ర్కార్

వారికి గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్ స‌ర్కార్

0

మే 3 తో లాక్ డౌన్ పూర్తి అవుతుంది, అయితే ఇంకా కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ హ‌ట్ స్పాట్ వంటి ప్రాంతాల్లో ఆంక్ష‌లు అమ‌లు చేస్తూ, లాక్ డౌన్ కొన‌సాగించే అవ‌కాశం ఉంది, అయితే దేశంలో ఈ 40 రోజులుగా పూర్తిగా మ‌ద్యం దుకాణాలు బంద్ అయ్యాయి, ఈ స‌మ‌యంలో క‌ల్లు కూడా కొంద‌రు తీయ‌డం లేదు.

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇస్తోంది కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌తో, తాజాగా క‌ల్లుగీత కార్మికుల‌కి కూడా వెసులుబాటు ఇచ్చింది, ఇక క‌ల్లుగీత వృత్తి చేసుకోవ‌చ్చు అని తెలిపింది. అయితే సామాజిక దూరం పాటిస్తూ ఈ క‌ల్లు అమ్మ‌వ‌చ్చు అని తెలిపింది, లాక్ డౌన్ వేళ వీరికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఈ తరుణంలో వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇవ్వడంతో గీతకార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటు పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు అనుమతి ఇచ్చింది నిన్న ఏపీ స‌ర్కార్, తాజాగా క‌‌ల్లుగీత కార్మికులు ఉపాధి దూరం అయింది కాబ‌ట్టి వారికి ఈ వెసులుబాటు ఇచ్చింది, వేలాది కల్లు గీత కార్మికుల‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి, మాస్క్ లు ధ‌రించిన వారికి అక్క‌డ క‌ల్లు అమ్మాలి, అలాగే సామాజిక దూరం పాటించి అమ్మాలి.