ముఖ్యమంత్రి గారూ, చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికా ప్రజలు మీకు అధికారమిచ్చింది?

ముఖ్యమంత్రి గారూ, చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికా ప్రజలు మీకు అధికారమిచ్చింది?

0

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకోవడానికే ప్రజలు తనకు అధికారమిచ్చినట్టు ఏపీ సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. “అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ అవినీతి ఏదో ఒకటి వెలికితీయండి అని అధికారులను ఆదేశించింది నిజమా? వారిపై ఒత్తిడి తెచ్చింది నిజమా? అయినా, అవినీతి గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉంది ముఖ్యమంత్రి గారూ!” అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.