అడ్డంగా వైసీపీకి మరోసారి బుక్కైన వర్ల రామయ్య

అడ్డంగా వైసీపీకి మరోసారి బుక్కైన వర్ల రామయ్య

0

వల్లభనేని వంశీ రగిల్చిన చిచ్చు ఇఫ్పుడు ఆరేలా కనిపించడం లేదు.. తీవ్ర విమర్శలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం నేతలు ఎవరికి వారు లోకేష్ చంద్రబాబుకి సపోర్ట్ గా చెబుతూ వల్లభనేని పై విమర్శల దాడి చేస్తున్నారు, ఈ సమయంలో ముఖ్యంగా వంశీ జూనియర్ ఎన్టీఆర్ అంశం తీసుకురావడం పెద్ద చర్చకు కారణం అయింది. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ని ఎందుకు వాడుకుని వదిలేశారు అని తీవ్ర విమర్శలు చేశారు వంశీ ..కేవలం లోకేష్ రాజకీయాల కోసం ఇలా ఎన్టీఆర్ ని పక్కన పెట్టేశారు అని అన్నారు.

ఇక మంత్రి కొడాలి నాని కూడా ఈ విషయం పై మాట్లాడారు, కావాలనే ఎన్టీఆర్ ని రాజకీయంగా తొక్కేసారు అని విమర్శించారు, చంద్రబాబు లోకేష్ పార్టీని సర్వనాశనం చేస్తారు అని విమర్శించారు అయితే చంద్రబాబు పై ఏదైనా విమర్శలు వస్తే వెంటనే రియాక్ట్ అయ్యే వ్యక్తుల్లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఒకరు.

తాజాగా ఈ అంశం పై ఆయన కూడా మాట్లాడారు.. మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. మా నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ అని ఆయన వ్యాఖ్యానించారు… అయితే ఇప్పుడు అవసరం లేదు, ఒకే 2009లో చంద్రబాబు స్ట్రాంగ్ కాదా? మరి ఎందుకు అప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ ని తీసుకువచ్చారు అని వైసీపీ ప్రశ్నిస్తోంది.