జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ నేత…

జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ నేత...

0

ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే… రాష్ట్రంలో ఎక్కడా అవినీతి జరుగకూడదని ఒక వేల జరిగితే వాటిని అరికట్టేందుకు తాజాగా జగన్ 14400 నెంబర్ ను లాంచ్ చేశారు…

రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగిందని ఫిర్యాదు చేస్తే దానికి 15 రోజుల్లో గా చర్యలు తీసుకోవాలని జగన్ తెలిపారు… అయితే ఈ అవకాశాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య సద్వినియోగం చేసుకున్నారు… 14400 డైల్ చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తండ్రిని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదు చేశారు…

ఈ విషయంలో ఏపీలో అందరిని ఆశ్చార్యానికి గురి చేస్తోంది… కొద్దికాలంగా రామయ్య వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుకుపడుతున్న సంగతి తెలిసిందే… మరి దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి…