కేఎ పాల్ తో పెట్టుకున్న వర్మ ఏం జరుగుతుందో…

కేఎ పాల్ తో పెట్టుకున్న వర్మ ఏం జరుగుతుందో...

0

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ యూట్యూబ్ లో మరో సంచలన వీడియో అప్ లోడ్ చేశారు… ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు ఈ చిత్రానికి సబంధించి దిపావళి కానుకగా ప్రేక్షకులకు ట్రైలర్ విడుదల చేశారు వర్మ..

ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే ఇక ఇదే క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మరో వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు వర్మ.. ఈ వీడియోలో ప్రజా శాంతి పార్టీ అధినేత కేఎ పాల్ గురించే ఉంది…

మనదంతా ఇంటర్ నేషనల్ థింకింగూ చిన్న చిన్న వాళ్లైన జగను, చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్ కాదు నెక్ట్స్ మన టార్గెట్ మోడీ….. 2024లో ఆ సీటు మందే మన ప్రమాణ స్వీకారానికి ఒక్కరిద్దరు కాదు 155 దేశాల ప్రధాన మంత్రులు వస్తారు… విత్ ఫ్యామిలీతో అంటూ పాల్ వాయిస్ తో ఒక వీడియోను రిలీజ్ చేశారు వర్మ..