మరో సార్ మెగా ఫామిలీ పై సెటైర్స్ వేసిన వర్మ..!!

మరో సార్ మెగా ఫామిలీ పై సెటైర్స్ వేసిన వర్మ..!!

0

రామ్ గోపాల్ ఎం చేసిన సంచలనమే.. ఎవరినైనా టార్గెట్ చేశాడంటే చాలు వాళ్ళు దిగొచ్చేదాకా వదలదు.. అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసిన వర్మ తాజా మరోసారి మెగా ఫామిలీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలవడం గురించి అటు టాలీవుడ్‌లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.అయితే ఈ భేటీ గురించి వర్మ తనదైన స్టయిల్లో మాట్లాడాడు. `వావ్.. 151తో 151` అంటూ ట్వీట్ చేశారు. 151 ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్‌తో 151 సినిమాలు చేసిన చిరంజీవి కలయిక అని అర్థం వచ్చేలా వర్మ ట్వీట్ చేశారు.

ఇకపోతే సోమవారం మధ్యాహ్నం చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు. చిరు దంపతులను సాదరంగా ఆహ్వానించిన జగన్.. వారితో కలిసి లంచ్ కూడా చేశారు.