వరుణ్ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాడట..!!

వరుణ్ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాడట..!!

0

వరుణ్ తేజ్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ అనే సినిమా తో ఫుల్ సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లను సాధిస్తుంది.. వరుణ్ ఈమధ్య ఏ సినిమా చేసిన సూపర్ హిట్ అవుతుంది అందుకు కారణం తన పాత్ర.. కథ బాగా తీర్చిదిద్దుకోవడమే.. అయితే తాజగా మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

ఈ కార్యక్రమంలో మంచు లక్ష్మి అనేక ప్రశ్నలు అడిగింది. అందులో వరుణ్ ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న కూడా ఒకటి ఉంది. అదేమంటే.. సాయి పల్లవి, రాశి ఖన్నా, పూజా హెగ్డే .. ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి పెళ్లి చేసుకుంటావు.. ఎవరిని చంపేస్తావు..

ఎవరితో డేటింగ్ చేస్తావు అని అడిగింది మంచు లక్ష్మి. దానికి వరుణ్ తేజ్.. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. రాశి ఖన్నాను చంపేస్తానని, పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానని సమాధానం ఇచ్చాడు. దీంతో సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.