టీడీపీకి బై..బై.. వైసీపీలోకి ఎందుకు వెల్లాల్సి వస్తోందో వంశీ క్లారిటీ..

టీడీపీకి బై..బై.. వైసీపీలోకి ఎందుకు వెల్లాల్సి వస్తోందో వంశీ క్లారిటీ..

0

తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే తన రాజకీయ గమ్యంపై క్లారిటీ ఇచ్చారు… ఇటీవలే ఆయన టీడీపీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… ఇకనుంచి తాను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించారు..

దీంతో వంశీని కన్విన్స్ చేసేందుకు విజయవాడ ఎంపీ కేసినేని నాని అలాగే కొనకళ్ల నారాయణలు రంగంలోకి దిగి దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు… పార్టీని వీడి ఎక్కడకు వెళ్లోద్దని కష్టకాలంలో అధినేత చంద్రబాబు నాయుడుకు అండగా ఉండాలని వంశీకి దైర్యం చెప్పారు….

పార్టీ మారినంత మాత్రనా సమస్యలు తొలగిపోవని చెప్పారట… అయితే తాను పార్టీ మారడం ఖాయం అని తేల్చి చెప్పారట వంశీ… తనపై అలాగే తన అనుచరులపై నమోదు అయిన కేసుల నేపథ్యంలో అనుచరులకోరిక మేరకు తాను వైసీపీలో చేరుతానని స్పష్టం చేశారు… దశాబ్దాల కాలం తాను నమ్ముకున్న అనుచరులకు న్యాయం జరగాలనే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు..