వీడు మ‌నిషి కాదు మృగ‌మూ కాదు ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తాడా ఉరివేయాల్సిందే

వీడు మ‌నిషి కాదు మృగ‌మూ కాదు ఇంత దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తాడా ఉరివేయాల్సిందే

0

దేశంలో ఇలాంటి దుర్మార్గులు చేసే దారుణాలు త‌ల‌చుకుంటేనే భ‌యం వేస్తోంది.. వీళ్ల‌ని జంతువులు అనికూడా అన‌కూడ‌దు, అవి కూడా ఆక‌లి వేసిన స‌మ‌యంలోనే దాడి చేస్తాయి, కాని వీరు స‌మాజంలో అత్యంత నీచులు అనే చెప్పాలి, ఓ వైపు క‌రోనాతో దేశం అల్లాడిపోతోంది, ఈ స‌మ‌యంలో చిన్నారి పై దాడి అత్యాచారం చేశారు దుర్మార్గుడు.

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ కామాంధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టాడు. అంతేకాదు ఆ చిన్నారి కళ్లుపీకి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

ఆ చిన్నారిని ఎవ‌రో ఆడుకుంటున్న స‌మ‌యంలో కిడ్నాప్ చేశారు, పాప క‌నిపించ‌డం లేదు అని త‌ల్లిదండ్రులు అంతా వెతికారు, కాని ఆమె జాడ తెలియ‌లేదు.. తెల్లవారు జామున ఇంటికి కొంచెం దూరంలో తీవ్ర గాయాలతో పాప కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసి.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విష‌యం పోలీసుల‌కు కంప్లైంట్ లో తెలిపారు. ఆ నీచుడి గురించి వెతుకుతున్నారు పోలీసులు, ఆమెకి చికిత్స అందుతోంది అత్యాచారం జ‌రిగింది అని క‌ళ్ల‌పై దాడి చేశార‌ని పోలీసులు తెలిపారు.