వెంకీ చేతులమీదుగా సుధీర్ సినిమా టీజర్ రిలీజ్..!!

వెంకీ చేతులమీదుగా సుధీర్ సినిమా టీజర్ రిలీజ్..!!

0

సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “త్రీ మంకీస్”…నాగేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విక్టరీ వెంకటేష్ చేతులమీదుగా రిలీజ్ చేసింది చిత్ర బృందం,.,.

సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మందు పార్టీలు చేసుకునే బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగనుంది. షకలక శంకర్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈ ముగ్గురిని ఎంతవరకూ బిజీ చేస్తుందో చూడాలి.