వెంకటేష్ కొత్త చిత్రం టైటిల్ అదిరింది

వెంకటేష్ కొత్త చిత్రం టైటిల్ అదిరింది

0

వెంకీ మామ చిత్రం తర్వాత విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు అదే అసురన్ రీమేక్ ..అవును ఆ చిత్రమే తమిళంలో ధనుశ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అసురన్.. తమిళ్ లో అక్కడ ఈ చిత్రం సూపర్ హిట్ అయింది, సినిమాలో ధనుష్ నటనకు అందరూ 100 కి 100 మార్కులు వేశారు, ధనుష్ నటనకై సినిమాని పది సార్లు చూసిన అభిమానులు ఉన్నారు.

ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమా కథ నచ్చడంతో వెంకటేష్ కూడా చేస్తాను అని ముందుకు వచ్చారు, అయితే ఈ సినిమా ఎవరు తెరకెక్కిస్తారా అని అనుకున్నారు.. చివరకు ఈ ప్రాజెక్ట్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను అనంతపురంలో చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ సినిమాకి నారప్పఅనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఈ చిత్రంలో ప్రియామణిని తీసుకున్నారు.. ముఖ్యమైన పాత్రలో చాలా మంది నటులని సెలక్ట్ చేశారు.. జూన్ లేదా జూలైలో చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.