సరికొత్త పాత్రలో కనిపించనున్న వెంకటేష్..!!

సరికొత్త పాత్రలో కనిపించనున్న వెంకటేష్..!!

0

ఎక్కువగా మల్టి స్టారర్ సినిమాల్లో కనిపిస్తున్న విక్టరీ వెంకటేష్ తాజాగా నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి బాబీ దర్శకుడు.. ఈ సినిమా తర్వాత వెంకటేష్ తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ కు సంబందించిన అప్డేట్స్ బయటకు వచ్చాయి.

వెంకీమామ తర్వాత వెంకటేష్ తరుణ్ భాస్కర్ డైరక్షన్ లో మూవీ కన్ఫాం అయ్యిందట.ఈ సినిమాలో వెంకటేష్ హార్స్ రేసర్ గా కనిపిస్తాడట. సినిమా కథ కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పెళ్లిచూపులుతో హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

అయితే తన మూడవ సినిమా వెంకటేష్ తో తీస్తున్నాడు తరుణ్ భాస్కర్. ఓ పక్క డైరెక్ట్ చేస్తూనే తను లీడ్ రోల్ గా మీకు మాత్రమే చెప్తా సినిమా చేస్తున్నాడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తున్నాడని తెలిసిందే.