వెంకీ మరో మల్టీస్టారర్ మరో హీరో ఎవరంటే

వెంకీ మరో మల్టీస్టారర్ మరో హీరో ఎవరంటే

0

తెలుగులో మల్టీస్టారర్ అంటే వెంటనే వినిపించే హీరో పేరు విక్టరీ వెంకటేష్ , సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి వెంకీ అదరగొడుతున్నారు మల్టీస్టారర్ చిత్రాలతో ఆయనకు మంచి పేరు వచ్చింది. వెంకటేశ్, ఈ నెల 13వ తేదీన వెంకీమామ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. మరి గతంలో ఎఫ్ 2 తర్వాత వస్తున్న చిత్రం దీంతో వెంకీ అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.

తరువాత అసురన్ రీమేక్ లో చేయనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక తర్వాత సినిమాపై కూడా ఆయన చర్చలు జరుపుతున్నారట.

అవును తాాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇటీవల ఆకుల శివ వినిపించిన ఒక కథ సురేశ్ బాబుకి బాగా నచ్చిందట. ఈ మల్టీస్టారర్ కథలో, ఒక కథానాయకుడిగా వెంకటేశ్ మరో కథనాాయకుడు నానీ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. అందుకే వీరితో చర్చించారు అని తెలుస్తోంది.. నాని కూడా ఈ చిత్రానికి ఒకే చెప్పారట.