వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి..!!

వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి..!!

0

సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్‌ను అభిమానులు, నటీనటుల కడసారి చూపు కోసం గురువారం మధ్యాహ్నం ఫిల్మ్‌ఛాంబర్‌కు తీసుకొచ్చారు. అయితే అక్కడికి ఛాంబర్‌లో వేణుమాధవ్ పార్థివ దేహానికి ఆయన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.

అభిమానుల అశ్రునయనాల మధ్య ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ అంత్యక్రియలు ముగిశాయి. నగరంలోని మౌలాలీ హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో కుటుంబసభ్యులు వేణుమాధవ్ దహన సంస్కారాలు నిర్వహించారు.