మోనాల్ తో వీడియో కాల్ — అఖిల్ కామెంట్ వైరల్

0
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4 లో మోనాల్, అఖిల్ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే.. ఇక ఈ జంట ఆట అందరికి నచ్చింది.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని వార్తలు వైరల్ అయ్యాయి…అయితే బిగ్‌బాస్ హౌజ్‌లో ఈ జంట చేసిన రచ్చ అంతా ఇంత కాదు.
మోనాల్, అఖిల్, అభిజిత్‌ల చూట్టే తిరిగింది ఆట.  ఇక అఖిల్ మోనాల్ గురించి చాలా మంది ఈ షో చూసేవారు, ఇక  బిగ్ బాస్ దత్త పుత్రిక మోనాల్ అని అందరూ కామెంట్లు చేసేవారు.
అయితే  ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ అయ్యారు.. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మోనాల్ అఖిల్ పలు పార్టీలలో కనిపించారు,  అయితే వీరిద్దరి మధ్య స్నేహం ఉందా ప్రేమ ఉందా అనేది అర్దం కావడం లేదు..తాజాగా అఖిల్, మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.
మోనాల్‌తో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత, మా సంతోషం ఇలా ఉందంటూ లవ్ ఎమోజీని జత చేశాడు. ప్రేమ క్యాన్సర్ వంటిది.. అది మరిచిపోయినట్టు చేస్తుంది.. చివరకు ప్రాణాలను తీసుకెళ్లిపోతోంది అని తెలిపాడు, దీంతో అభిమానులు ఈ కామెంట్ ఏమిటి అని  అంటున్నారు సోషల్ మీడియాలో. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here