జగన్ పై ఫైర్ బ్రాండ్ వైసీపీ లేడీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్ పై ఫైర్ బ్రాండ్ వైసీపీ లేడీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై ఆ పార్టీ చిలకలూరి పేట ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ విడదల రజిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ…

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చికి కేవలం వందరోజులు మాత్రమే పూర్తి అయిందని అప్పుడే బీజేపీ నాయకులు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు… ఎన్నికల ప్రచారంలో జగన్ వందరోజుల్లో మార్పు తీసుకువస్తానని చెప్పిలేదని అన్నారు.

అలాగే జగన్ ను ప్రజలు వందరోజుల ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదని తెలిపారు. ఐదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు ఆయనకు ఆకాశమంత విజయాన్ని అందించారని తెలిపారు… జగన్ ఈ ఐదేళ్ల పాలన 30 ఏళ్ల పాటు గుర్తిండిపోయేలా ఉంటుందని రజని తెలిపారు.