విజ‌య్ భారీ విరాళం సౌత్ ఇండియా అంతా ఇచ్చిన హీరో

విజ‌య్ భారీ విరాళం సౌత్ ఇండియా అంతా ఇచ్చిన హీరో

0

కోర‌నా స‌మ‌యంలో హీరోలు త‌మ పెద్ద మ‌న‌సు చాటుకుంటున్నారు, ఈ స‌మ‌యంలో విరాళాలు అందిస్తున్నారు, అంతేకాదు పేద‌ల‌కు సాయం చేస్తున్నారు, అలాగే ప్ర‌భుత్వానికి విరాళం ఇస్తూ సినిమా ప‌రిశ్ర‌మ త‌ర‌పున సాయం చేసే వారికి న‌గ‌దు సాయం అందిస్తున్నారు, వారి చారిటీల ద్వారా నిత్య అవ‌స‌ర వ‌స్తువులు అందిస్తున్నారు..

తాజాగా త‌న వంతుగా దక్షిణాది రాష్ట్రాలకు రూ.1.3 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు హీరో విజయ్. ఈ క్రమంలో ఆయన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు కూడా రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు.

అలాగే ప్రధాని మంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, తమిళనాడుకు రూ.50 లక్షలు, కేరళలకు రూ.10 లక్షలు, ఫెప్సీకి రూ.25 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, కర్ణాటకకు రూ.5 లక్షలు, పాండిచ్చెరీకి రూ.5 లక్షలను విజయ్ విరాళాలుగా ప్రకటించారు. ఇలా ఆయ‌న సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ కు విరాళం ప్ర‌క‌టించారు. ఇక ఆయ‌న అభిమానులు మాత్రం త‌మ హీరో మంచి మ‌న‌సుతో విరాళం ఇవ్వ‌డం పై చాలా ఆనందంలో ఉన్నారు.