విజయ్ సినిమాకోసం తెలుగులో భారీ రేటు

విజయ్ సినిమాకోసం తెలుగులో భారీ రేటు

0

తమిళనాట విజయ్ సినిమా వస్తోంది అంటే ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, మెరుపు తీగలా విజయ్ డ్యాన్స్ నటనకు అక్కడ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఈ మధ్య విజయ్ భారీ విజయాలతో దూసుకుపోతున్నాడు. తెలుగులో ఇటీవల వచ్చిన విజిల్ మంచి వసూళ్లను రాబట్టింది.

అయితే తెలుగులో గత సినిమాల కంటే విజిల్ మరింత వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ తాజా చిత్రం రూపొందుతోంది. ఒక వైపున ఖైదీ సినిమాతో లోకేశ్ కనగరాజ్ .. మరో వైపున విజిల్ తో విజయ్ భారీ హిట్స్ ఇచ్చి వున్నారు. అయితే తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్.

తాజాగా ఈ సినిమాకి తెలుగు హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగులో విజిల్ ను విడుదల చేసిన మహేశ్ కోనేరు, ఈ సినిమా తెలుగు హక్కులను కూడా సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన 8.75 కోట్ల రూపాయలను చెల్లించినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ రేటు చూసి టాలీవుడ్ ప్రముఖులు కూడా షాకయ్యారట దటీజ్ విజయ్ సినిమా అంటున్నారు.