విజయ్ దేవరకొండ హీరోయిన్ కోసం కరణ్ ప్రయత్నాలు కొత్త హీరోయిన్ ఎవరంటే

విజయ్ దేవరకొండ హీరోయిన్ కోసం కరణ్ ప్రయత్నాలు కొత్త హీరోయిన్ ఎవరంటే

0

విజయ్ దేవరకొండ తన కెరియర్ లో అన్నీ హిట్ సినిమాలు చేశాడు…. తాజాగా పదవ చిత్రం చేస్తున్నారు ఆయన , ఈ చిత్రానికి పూరి దర్శకత్వం వహిస్తున్నారు.. ముంబయిలో ఈ సినిమా లాంచనంగా స్టార్ట్ అయింది.. ఇక ఈ చిత్రం చార్మీ అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు, నేరుగా బాలీవుడ్ లో కూడా విడుదల కానుంది,

పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా మూవీ అంటే ఖచ్చితంగా హీరోయిన్ బాలీవుడ్ ముద్దుగుమ్మ అయితేనే బాగుంటుంది. అందుకే విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్ ను అనుకున్నారు. కాని ఆమెకు చాలా సినిమాలు లైన్ లో ఉండటంతో డేట్స్ కుదరదు అని చెప్పారట.. అయితే కరణ్ మాత్రం మరో హీరోయిన్ ని ఫైనల్ చేయాలి అని చూస్తున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అనన్య పాండే ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు పతీ పత్నీ ఔర్ ఓ చిత్రంతో సక్సెస్ దక్కించుకుంది. తాజాగా ఆమె చేతిలో సినిమాలు ఉన్నాయి, ఖాలీ పీలి అనే సినిమాలో నటిస్తోంది. అయితే నిర్మాత కరణ్ సినిమా అంటే ఎవరు అయినా ఒకే చెబుతారు.. అందుకే ఆమె ఈ చిత్రంలో నటించేందుకు ఎస్ చెబుతారు అంటున్నారు.