విజయ్ దేవరకొండ- కరణ్ జోహార్ సినిమా

విజయ్ దేవరకొండ- కరణ్ జోహార్ సినిమా

0

వరుస విజయాలతో దూసుకుపోతున్నారు హీరో విజయ్ దేవరకొండ.. తాజాగా ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో పెళ్లి చూపులు సినిమాతో ఇటు టాలీవుడ్ లో నే కాదు కోలీవుడ్ లో మంచి ప్లేస్ సంపాదించారు.. అలాగే బాలీవుడ్ లో కూడా ఆయనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.. ఆయన సినిమాలు చూసేందుకు అక్కడ అభిమానులు ఇష్టపడుతున్నారు.

అందుకే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ ..విజయ్ దేవరకొండ కలయికలో రాబోతున్న ఫైటర్ చిత్రం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా తీసుకురానున్నారట.

అవును పూరీ ఇప్పటికే ఈసినిమాని సౌత్ లో అన్నీ భాషలలో తెరకెక్కించనున్నారు. పూరి నిర్మాణ భాగస్వామి ఛార్మి కౌర్ తాజాగా ఓ ప్రపోజల్ కరణ్ ముందు ఉంచారట..ఫైటర్ ను పాన్ ఇండియన్ మూవీగా తీర్చిదిద్దే ప్రతిపాదనతోనే చర్చ జరిపారట. దీనికి కరణ్ ఒకే చెప్పారు అని తెలుస్తోంది.. త్వరలో ఆయన కూడా నిర్మాతగా ఓ ప్రకటన వస్తుంది అని తెలుస్తోంది.