విజయ్ దేవరకొండ కొత్త సినిమా హీరో కాదు..

విజయ్ దేవరకొండ కొత్త సినిమా హీరో కాదు..

0

ఇటీవలే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫస్ట్ లుక్ తో పలకరించిన విజయ్ దేవరకొండ తన తర్వాత చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.. అయితే దానికి ముందు డియర్ కామ్రేడ్ చేస్తున్న టైములో ‘హీరో’ అనే సినిమా చేసాడు. అది ఎందుకనో సడన్ గా ఆగిపోయిందని చెప్పారు.

అవి ఉట్టి పుకారులే అని చాలామంది అన్నారు. కానీ లేటెస్ట్ గా విజయ్ కొంతమంది మీడియా ప్రతినిథులతో ఆఫ్-ది రికార్డు మాట్లాడారు.అప్పుడు విజయ్ “అవును హీరో సినిమా ఆగిపోయిందని” చెప్పాడు తప్ప ఎందుకు ఆగింది మాత్రం చెప్పలేదు.

దాని ప్లేస్ లో పూరి తో ‘ఫైటర్’ అనే సినిమా చేస్తున్న అని చెప్పాడు. ఇకపోతే పూరి దర్శకత్వంలోని సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుండగా వరల్డ్ ఫేమస్ లవర్ అతిత్వరలోనే రిలీజ్ కానుంది..