విజయ్ దేవరకొండ పేరుమార్చుకున్నారు ఎందుకంటే

విజయ్ దేవరకొండ పేరుమార్చుకున్నారు ఎందుకంటే

0

విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో… ఆయన క్రేజ్ అంతా ఇంతా కాదు, కుర్రాళ్లకు ఆయన సినిమాలు అన్నా ఆయన నటన అన్నా ఎంతో ఇష్టం.. లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది విజయ్ కు అభిమానులు అయ్యారు.

అలాంటి విజయ్ దేవరకొండ తన పేరులో మార్పు చేసుకున్నాడు. దేవరకొండ విజయ్ సాయిగా తన పేరులో మార్పు చేసుకున్నాడు. తన తాజా చిత్రమైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి గాను ఆయన ఇదే పేరును వేసుకున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ వలన ఈ విషయం స్పష్టమైంది. దీంతో ఆయన పేరు మార్చుకోవడానికి కారణం ఏమిటి అనేది అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే విజయ్ కు కెరియర్ చాలా బాగుంది… మరింత ఆయనకు కలిసి రావాలి అంటే. పేరులో మార్పు కావాలి అని చెప్పారట… అందుకే ఆయన ఈ మార్పు చేసుకున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు మాత్రం ఆయన పూర్తిపేరుని వేసుకున్నారు అని అంటున్నారు, సో దీనిపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ నాలుగు డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో కనిపించనున్నారు.ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది విజయ్ చిత్రం.