విజయ్ చించేశాడుగా..మెస్మరైజింగ్ లుక్..!!

విజయ్ చించేశాడుగా..మెస్మరైజింగ్ లుక్..!!

0

ఇటీవలే ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి కాస్త నిరాశ చెందిన విజయ్ దేవరకొండ ఈ సారి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కొద్ది సేపటి క్రితమే చిత్రయూనిట్ విడుదల చేసింది. మరోసారి అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేసేలా వరల్డ్ ఫేమస్ లవర్ ఫస్ట్ లుక్ ఉంది. చేతిలో సిగరెట్, ముఖం రక్తపు మరకలతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

అయితే పోస్టర్ మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్‌ ఎంటర్ టైనర్‌లో విజయ్ దేవరకొండ సరసన రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌,, క్యాథెరిన్ థెరిస్సా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. మొత్తానికి టైటిల్ బాగా క్యాచీగా ఉంది.

మరి సినిమా ఎలా ఉంటుంది చూడాలి. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రం డియర్ కామ్రేడ్ ఆశించిన విజయం సాధించలేక పోయింది. దాంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఈ సినిమా పైనే పెట్టుకున్నాడు.