పుష్ప-2: పవర్‌ఫుల్ పాత్రలో విజయ్ సేతుపతి..

0

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి అర్ధం ఉన్న కథలను ఎంచుకుంటూ విశేష ప్రేక్షాదరణ సొంత చేసుకున్నాడు. ముఖ్యంగా ఇటీవలే సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప’ సినిమా దేశవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. పుష్పకి సీక్వెల్ గా పుష్ప పార్ట్-2 కూడా తీయడానికి చిత్రబృందం అన్ని సన్నాహాలు చేస్తూ బన్నీ ఫాన్స్ ను ఖుషి చేస్తున్నారు.

సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ అంటున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

పుష్ప పార్ట్-2లో ఎవరూ ఊహించని సర్ ప్రైజెస్ ను దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రకోసం తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అల్లు అర్జున్ తో పాటు సర్ ప్రైజ్ ప్యాకేజీగా విజయ్ సేతుపతిగా వస్తారా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎలాంటి  అధికారిక ప్రకటన అయితే రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here