విజయ్‌మాల్యా అప్పగింత…కోర్టు కీలక తీర్పు

విజయ్‌మాల్యా అప్పగింత...కోర్టు కీలక తీర్పు

0

లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా గురించి పరిచయం అవసరం లేదు. ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పరారైన మాల్యా లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను భారతదేశానికి అప్పగించాలని మనదేశం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు కోర్టు ద్వారా ఆదేశాలు విడుదల చేయించింది. అయితే, యూకేలో నక్కిన నీరవ్ మోదీ అక్కడి నుంచి బయటకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. బెయిల్ పిటిషన్‌ని అక్కడి కోర్టులో దాఖలు చేశారు. అయితే ఇటీవల అక్కడి న్యాయస్థానం కొట్టివేసింది. అయినప్పటికీ…ఆయన తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక తీర్పు రానుంది.

మాల్యాను ఇండియాకు అప్పగించాలంటూ యుకె హోమ్ సెక్రటరీ సాజిద్ జావీద్ తన సంతకంతో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన లీవ్ అప్పీలుపై లండన్ కోర్టు రాతపూర్వకంగా ఇదివరకే తిరస్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే తిరిగి దాఖలు చేసుకోవచ్చునని పేర్కొనడంతో మౌఖిక విచారణకు కోర్టు ఆదేశించింది. తన అప్పగింతను సవాలు చేస్తూ అప్పీలు చేసుకునేందుకు ఆయన కోర్టు అనుమతిని కోరి పిటిషన్ దాఖలు చేశారు. విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించే విషయమై లండన్ కోర్టు మంగళవారం తీర్పునివ్వనుంది. రాయల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ కోర్టులో జడ్జీలు జార్జ్ లెగాట్, ఏండ్రు పాపుల్ నెల్ తో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.