అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది జస్ట్ వేయిట్

అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోంది జస్ట్ వేయిట్

0

రివర్స్ టెండర్లతో తెలుగుదేశం పార్టీ నాయకులు అవినీతి బాగోతం సాక్ష్యాధారాలతో బయట పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి హెచ్చించారు…

ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా రాసే బోగస్ వార్తలకు రెస్పాన్స్ లేకపోవడంతో మీరే రంగంలోకి దిగారా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.. టెండర్లలో పాల్గొనద్దని కాంట్రాక్టు సంస్థలను బెదిరిస్తున్నారట. ఇంత దిగజారి పోయారేంటి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు

పోలవరంలో 3 పనులకే టెండర్లు పూర్తయ్యాయి. చంద్రబాబు ఆయన బానిసలు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. విద్యుత్తు పీపీఏల సమీక్షతో ఏటా వేల కోట్లు ఆదా అవుతాయి. ఇంకా 50కి పైగా ఇరిగేషన్ పనులు టెండర్లకు రానున్నాయి. ప్రజా ధనాన్ని ఇంత విచ్చల విడిగా, పబ్లిగ్గా దోచుకోవడం ఎక్కడా కనబడదని విజయసాయిరెడ్డి అన్నారు.