చంద్రబాబుపై విజయసాయిరెడ్డి పంచ్ డైలాగ్స్

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి పంచ్ డైలాగ్స్

0

విశ్వసనీయత, నిజాయితీ అనేవి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిక్షనరీలో ఉండవని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. నయవంచన, మ్యానిప్యులేషన్ల ద్వారా రాజకీయ వైకుంఠపాళిలో పైకి ఎగబాకిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు..

దోషాలు లేని వ్యక్తిత్వాన్ని ఆయన నుంచి ఆశించలేం. అలాగే తను మారాలని కూడా అనుకోరని అన్నారు. నక్కజిత్తులతో ప్రజలను ఎలా వంచించాలని నిరంతరం యోచిస్తుంటారని ఆరోపించారు.. అలాగే అసెంబ్లీలో తను మాట్లాడుతుంటే వైఎస్ వణికే వారని చంద్రబాబు సొంత డప్పు కొట్టుకుంటున్నారని ఆరోపించారు.

అప్పట్లో వైఎస్సార్ వాగ్దాటికి బాబు ఏ విధంగా ఊచకోతకు గురయ్యేవారో అందరికీ తెలుసని. ఆయనిప్పుడు లేరు కదాని కథలు వినిపిస్తున్నారని అన్నారు. ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్లి చూడండి మొత్తం కథ అర్థం అవుతుందని అన్నారు