విజయసాయిరెడ్డికి సుజనా స్ట్రాంగ్ కౌంటర్…

విజయసాయిరెడ్డికి సుజనా స్ట్రాంగ్ కౌంటర్...

0

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు… కరోనా టెస్ట్ కిట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆయన ఆరోపించారు… తాజాగా సుజనా మీడియాతో మాట్లాడుతూ… నిన్న తన మిత్రుడు తనకు ఫోన్ చేసి కుక్కలు మీపై మొరుగుతున్నాయని చెప్పారని అన్నారు…

ప్రస్తుతం విజయసాయిరెడ్డి అవాకులూ చవాకులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు… కాగా బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ సుజనా చౌదరికి 20 కోట్లకు అమ్ముడు పోయారని విజయసాయిరెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే…

దీనిపై కన్నా కూడా స్పందించారు.. జైలు నుంచి వచ్చిన వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందని అన్నారు.. తనను ఎవరు కొనుగోలు చేసే పరిస్థితి లేదని అన్నారు… విజయసాయిరెడ్డి మరోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు… విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు…