సరిలేరు నీకెవ్వరూ లో విజయ శాంతి రోల్ మాములుగా లేదుగా..!!

సరిలేరు నీకెవ్వరూ లో విజయ శాంతి రోల్ మాములుగా లేదుగా..!!

0

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరూ.. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది.మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమా నిర్మితమవుతుంది..రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ, హరితేజ, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్, వెన్నెల కిశోర్ పవిత్ర లోకేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరుగాంచిన విజయశాంతి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ కూడా ఈ సినిమాతోనే మళ్ళి సినిమాల్లోకి నటుడిగా వస్తున్నారు. . సినిమాలో ఆమె క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉందని, అలానే సినిమాలోని కొన్ని కీలక సీన్స్ ఆమె క్యారెక్టర్ తో ముడి పడి ఉంటాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక కొన్నేళ్ల గ్యాప్ తరువాత ఆమె నటిస్తున్నప్పటికీ, ఆమె నటనలో జోరు ఏ మాత్రం తగ్గలేదట.