విజయశాంతి పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో తెలుసా కారణం ఇదే

విజయశాంతి పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో తెలుసా కారణం ఇదే

0

టాలీవుడ్ లో ఒకప్పుడు పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఆమె వెలుగొందారు, ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నటీమణిగా పేరు సంపాదించారు.. తెలుగు తమిళంలో అగ్రనటులు దర్శకులు ఆమెతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేవారు….దేశంలోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ ఇండియన్ బ్యూటీగా పేరు సంపాదించారు…ఆమె ఎవరో కాదు లేడి అమితాబ్ విజయశాంతి…అమ్మాయిలు ఆడపులుల్లా ఉండాలి అని, తన సినిమాలతో కొత్త ఒరవడిని తీసుకువచ్చి కొత్తతరం సినిమాలు చేసి పేరు గడించారు విజయశాంతి.

అయితే తర్వాత రాజకీయాల్లో బిజీగా మారి సినిమాలకు గ్యాప్ ఇచ్చారు.. ఇప్పుడు 13 సంవత్సరాల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ చేస్తున్నారు విజయశాంతి… తాజాగా కొన్ని విషయాలను ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్నారు అందులో ఓ విషయం గురించి అందరూ అభిమానులు చర్చించుకుంటున్నారు.

పిల్లలు అంటే తనకు ఎంతో ఇష్టమని పిల్లలను కంటే తన స్వార్థం పెరుగుతుందని ఆలోచించిన మీదటే పిల్లలు వద్దు అని నిర్ణయం తీసుకున్నాను అంటూ విజయశాంతి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా అన్న స్వార్ధాన్ని వదిలేసి మన అన్న ధోరణితో సాగాలని తాను భావించినట్లు విజయశాంతి చెప్పుకొచ్చారు. తన భర్త నేను ఇష్టపూర్వకంగా ఆర్బాటాలు లేకుండా స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము అని తెలిపారు ఆమె.