శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలపై వైరల్ న్యూస్..టీటీడీ క్లారిటీ

Viral news on Srivari special scenes..TTD Clarity

0

కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందు వ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోంది.

అయితే గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవాస్త‌వ స‌మాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజ‌మ‌ని న‌మ్మి తిరుపతికి వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది. భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here