ఓటిటిలోకి విరాటపర్వం..డీల్ ఎంతంటే?

0

రానా ద‌గ్గుబాటి ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇటీవలే నటించిన అన్ని సినిమాలు దాదాపు విజయం సాధించాయి. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటించి తన మార్క్ చాటుకున్నాడు. తాజాగా విరాట‌ప‌ర్వం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఈ చిత్రంలో రానా న‌క్స‌లైట్ పాత్ర‌లో మనకు కనబడనుండగా..సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా నటించింది.యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తూము సరళ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. థియేటర్లలో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతుంది.

కాగా, ఈ సినిమా OTT రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు ముందుకొస్తున్నాయి. విరాటపర్వం’ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. రూ.15 కోట్లు పెట్టి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్.. ఈ రైట్స్‌ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే విరాటపర్వం మంచి వసూళ్లు రాబట్టి లాభాల్లోకి వెళుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here