చంద్రబాబుకు పెద్ద నమస్కారం పెట్టి వైసీపీలో చేరేందుకు సిద్దమైన విశాఖ కీలక నేత

చంద్రబాబుకు పెద్ద నమస్కారం పెట్టి వైసీపీలో చేరేందుకు సిద్దమైన విశాఖ కీలక నేత

0

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి…. ప్రస్తుతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలవల్ల సహజంగా పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది వైసీపీలోకి బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే

ఇదే క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని చూస్తున్నారట… విశాఖ అర్భన్ టీడీపీ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ ఆయన సతీమణి వైసీపీ తీర్థం తీసుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి…

జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు వీరిపై గుర్రున ఉన్నారు… అందుకే వీరి టార్చర్ తట్టుకోలేక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. ఇటీవలే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినప్పుడు వైసీపీ పాలనను రహమాన్ మెచ్చకున్నారు దీని బట్టి వారు త్వరలో వైసీపీలో చేరబోతున్నారనే నిర్ణయానికి వచ్చారు..