విశాఖ టీడీపీ నేతకు సీఎం జగన్ బంపర్ ఆఫర్…

విశాఖ టీడీపీ నేతకు సీఎం జగన్ బంపర్ ఆఫర్...

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది… గాజువాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి త్వరలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

అంతేకాదు ఆయనకు గ్రేటర్ విశాఖ మేయర్ పదవి ఆఫర్ ఇచ్చారని అంటున్నారు… దీంతో ఆయన పార్టీ మారేందుకు డిసైడ్ అయ్యారని అంటున్నారు… కరోనా అలజడి తగ్గిన తర్వాత ఆయన మంచి మూహూర్తం చూసుకుని వైసీపీ తీర్థం తీసుకుంటారని చర్చించుకుంటున్నారు…

ఇక పల్లా పార్టీ మారితే కీలక నియోజకవర్గం అయిన గాజువాకలో టీడీపీ దుకాణం బంద్ అయినట్లే ఈయన తప్ప ఇక్కడ టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకులు లేరు… అంతా తృతియ నాయకులే ఉన్నారు వీరు పార్టీ నడిపించే సత్తాలేనివారు…