హీరోగా వి.వి.వినాయక్…!

హీరోగా వి.వి.వినాయక్...!

0

సినిమా ఇండస్ట్రీలో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు వివి వినాయక్ రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనతను దక్కించుకున్న వి.వి.వినాయక్ మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు దిల్, ఆది, బన్నీ, ఠాగూర్, లక్ష్మి, నాయక్, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను అందించి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు దర్శకుడిగా అందరి అభిమానాలు సంపాదించుకున్న వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే…

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెరకెక్కించే ఈ సినిమాలో వి వి వినాయక్ హీరోగా కనిపించనున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన ఎం నరసింహారావు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈయన గతంలో శరభ అనే సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమాలో వినాయక్ పాత్ర ఎంతో స్పెషల్ గా ఉంటుందని అని అందుకే దీనికోసం కొద్దిరోజులుగా ఆయన జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు.. శ్రీ నవ్ హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్ సమర్పణలో వస్తున్న చిత్రం “రాగల 24 గంటల్లో” ఈ సినిమాలో లో ఈషా రెబ్బ లీడ్ రోల్ చేస్తుంది.

ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో వివి వినాయక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు తాను ఇండస్ట్రీకి రాకముందు నుంచే శ్రీనివాస్ రెడ్డి తనకు మంచి ఫ్రెండ్ అని, తనకి ఎన్నో సలహాలు ఇచ్చే వాడని అప్పట్లో తాను చెన్నైలో ఉండలేక వెళ్లిపోదామా అనుకున్న సమయంలో తనకు ధైర్యం చెప్పి తనలో నమ్మకం నింపి తాను ఇండస్ట్రీకి దూరం కాకుండా ఆ పాడని తెలిపాడు.