భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న వైజయంతీ మూవీస్

భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్న వైజయంతీ మూవీస్

0

తెలుగులో అగ్రస్థాయి కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మించి, ఘన విజయాలను సొంతం చేసుకున్న బ్యానర్ గా వైజయంతీ మూవీస్ కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ బ్యానర్ నుంచి వచ్చిన ‘మహానటి’ సంచలన విజయాన్ని అందించింది. తాజాగా ఈ బ్యానర్ నుంచి ట్వీట్ రూపంలో ఒక ప్రకటన వంటిదే వెలువడింది.

వచ్చేనెల నుంచి తాము మొదలెట్టనున్న సినిమా కోసం పనిచేయడానికి విజువల్ ఆర్టిస్టులు .. డిజైనర్లు .. రైటర్లు కావాలంటూ ఒక ప్రకటన చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించే ఈ సినిమా పనులు సెప్టెంబర్లో మొదలవుతాయనే విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఒక అడ్వెంచరస్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం వుంది.