కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే బ్రెయిన్ సైజు తగ్గిపోతుందా?

మీకు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే అలవాటు ఉందా?

అయితే వెంటనే మానేయమంటున్నారు పరిశోధకులు.

2017 లో బోస్టన్ యూనివర్సిటీలో 4000 మందిపై ఓ రీసెర్చ్ చేశారు.

ఈ సర్వేలో రెగ్యులర్ గా కూల్ డ్రింక్స్ తీసుకునే వారిలో అనూహ్య మార్పులు కనుగొన్నారు.

వీరిలో బ్రెయిన్ సైజ్ తగ్గిపోవడాన్ని గుర్తించారు.

అలాగే మెదడులోని హిప్పోకాంపస్ సైజ్ తగ్గిపోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, హార్ట్ బీట్ ఎఫెక్ట్ అయిందని రీసెర్చ్ లో తేలింది.

దీనికి కూల్ డ్రింక్స్ లో ఉండే సోడా, షుగర్ కంటెంట్ కారణమని తెలిపారు.

ఈ కూల్ డ్రింక్స్ లో ఉండే షుగర్ వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

అందుకే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండమని నిపుణులు చెబుతున్నారు.