వాట్సాప్​ అదిరిపోయే ఫీచర్..ఇక‌పై వాయిస్ మెసేజ్‌ల‌ను అలా కూడా వినొచ్చు..

Whatsapp is a creepy feature..now you can also listen to voice messages ..

0

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​ వాయిస్​నోట్​ ఫీచర్​లో మరో కొత్త అప్​డేట్​ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది. వాయిస్‌నోట్‌ ఫీచర్‌లో మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్‌ మెసేజ్‌ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

ప్రస్తుతం వాయిస్‌ మెసేజ్ ప్లే చేసి చాట్‌ పేజీ నుంచి బయటకు వస్తే ఆడియో ఆగిపోతుంది. త్వరలో అందుబాటులోకి రానున్న అప్‌డేట్‌తో వాయిస్‌ మెసేజ్‌ ప్లే చేసి, ఎంచక్కా ఇతరులతో చాట్ చేస్తూ ఆడియోను వినవచ్చు. మనం ప్లే చేసిన వాయిస్‌ మెసేజ్‌ చాట్ పేజీ పై భాగంలో కనిపిస్తుందని వాట్సాప్​ బీటా ఇన్ఫో వెల్లడించింది.ఈ ఫీచ‌ర్ అందుబాటులోకి వ‌స్తే ఇక‌పై యూజ‌ర్లు ఆడియో మెసేజ్ వింటూనే ఇత‌రుల‌తో చాటింగ్ చేసుకోవ‌చ్చు.

గతంలో వాయిస్‌ మెసేజ్‌లు రికార్డ్‌ చేసిన వెంటనే వెళ్లిపోయేవి. కొద్దిరోజుల క్రితం ప్రివ్యూ వాయిస్‌ నోట్స్‌ పేరుతో కొత్త అప్‌డేట్‌ను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. దీంతో యూజర్స్ రికార్డ్ చేసిన మెసేజ్‌ను ఇతరులకు పంపే ముందే విని అందులో ఏవైనా తప్పులుంటే డిలీట్ చేసి, మరో కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపొచ్చు. అలానే వాయిస్‌ మెసేజ్‌ వినేప్పుడు వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ప్లేబ్యాక్‌ స్పీడ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్స్‌ కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్స్‌కు పరిచయం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here