మోక్షజ్ఞ తో సినిమా తీసే ద‌ర్శ‌కుడు ఎవ‌రు ?

Who is the director a film making with 'Mokshajna'

0

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి కొన్ని నెల‌లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. నంద‌మూరి అభిమానులు కూడా ఎప్పుడు బాల‌య్య ఈ గుడ్ న్యూస్ చెబుతారా అని చూస్తున్నారు. అయితే క‌చ్చితంగా కుమారుడు సినిమా ఎంట్రీ ఉంటుంద‌ని ఇంకా స‌మ‌యం ఉంద‌ని ప‌దే ప‌దే బాల‌య్య కూడా ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెబుతున్నారు.

ఆదిత్య 369 సినిమా సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే మాట ఇటీవల వినిపించింది.
బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ కనిపిస్తాడని చాలా వార్త‌లు వినిపించాయి. తాజాగా మ‌రో వార్త వినిపిస్తోంది. ఆయ‌న ఓ సోలో స్టోరీతోనే వెండితెర‌పై ఎంట్రీ ఇస్తార‌ని అంటున్నారు. ఇక చాలా మంది ద‌ర్శ‌కులు క‌థ‌లు వినిపిస్తున్నార‌ట‌. ఇంకా బాల‌య్య ఏ క‌థ ఫైన‌ల్ చేయ‌లేదు అని తెలుస్తోంది.

మోక్షజ్ఞతో సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా రంగంలోకి దిగారని అంటున్నారు.
ఉప్పెన సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు పేరు కూడా వినిపిస్తుంది. దాదాపు టాలీవుడ్ లో ఆరుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here