రెండోవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ?

Who will be eliminated from the big House on second week ?

0

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది ఈ సీజన్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈసారి షో అంత రసవత్తరంగా లేదు అనే కామెంట్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా ఐదోసారి బిగ్బాస్ సీజన్ 5ను నాగ్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, సన్నీ, విశ్వ, ఈ నలుగురి పేర్లు టైటిల్ ఫేవరేట్ గా వినిపిస్తున్నాయి.

అయితే సెప్టెంబర్ 5న ఎంతో అట్టహాసంగా 19 మంది కంటెస్టెంట్స్తో ఈ షో ప్రారంభమైంది. ఇప్పటికే ఈ షో నుండి తొలి వారం సరయు హౌస్ నుండి ఎలిమిట్ అయింది. ఇక ఆమె ఫ్యాన్స్ ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె బాగానే ఆడింది కాని ఆమెకి ఓటింగ్ పెద్దగా రాలేదు అని ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అయితే ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా నటి ఉమాకి ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

రెండో వారం ఉమా దేవితో పాటు పలువురు పేర్లు వినిపిస్తున్నా ఈ వారం ఆమె హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు బిగ్ బాస్ అనలిస్టులు సోషల్ మీడియాలో చెబుతున్నారు. మరి మీరేమంటారు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

రెండోవారం నామినేషన్స్
వోల్ఫ్ టీమ్ నుంచి ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, కాజల్.
ఈగల్ టీమ్ నుంచి లోబో, ప్రియాంక సింగ్, అనీ మాస్టర్, ప్రియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here