ఫోన్‌ స్టోరేజ్ ఫుల్ అవుతుందా? అయితే ఇలా చేయండి

0

ఫోన్‌ లో స్టోరేజ్‌ నిండిందనే మెసేజ్ కనిపించగానే వెంటనే అవసరంలేని ఫైల్స్‌ను డిలీట్ చేస్తాం. అయినా కూడా స్టోరేజ్‌ ఫుల్‌ అనే చూపిస్తుంది. ఫైల్స్‌ డిలీట్‌ చేసినా ఎందుకు అలా చూపిస్తుంది? కొన్నిసార్లు ఫోన్‌ నుంచి డేటా డిలీట్‌ చేసినా సదరు ఫైల్స్‌ బయటివారికి చేరిపోతుంటాయి. మరి మన ఫోన్‌ నుంచి అవసరంలేని ఫొటో, వీడియో, ఫైల్స్‌ను శాశ్వతంగా ఎలా డిలీట్‌ చేయాలి? మనం డిలీట్ చేసిన డేటా ఇతరుల చేతికి చిక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫైల్స్‌ డిలీట్‌ చేసిన తర్వాత అవి సదరు ఫోల్డర్‌లో ఉన్న ట్రాష్‌ లేదా రీసైకిల్ బిన్‌ ఫోల్డర్‌లోకి వెళతాయి. అంటే అవి ఇంకా ఫోన్‌లో ఉన్నట్లే. అందుకే ఫోన్‌ నుంచి ఫైల్స్‌ను శాశ్వతంగా డిలీట్‌ చేసేందుకు ఫైల్‌ మేనేజర్‌ లేదా ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఇందుకోసం మీ ఫోన్‌లోని ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి ఫైల్స్‌ను సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. అలా చేయడం వల్ల మీరు సెలక్ట్ చేసిన ఫైల్స్‌ ఫోన్‌ నుంచి శాశ్వతంగా డిలీట్ అవుతాయి. అయితే మీ ఆండ్రాయిడ్ ఖాతా గూగుల్ ఫొటోస్‌ లేదా డ్రైవ్‌ వంటి ఇతరత్రా క్లౌడ్ స్టోరేజ్‌ సేవలకు అనుసంధానమైతే వాటి నుంచి కూడా డిలీట్ చేయాలి.

ఒకవేళ మీ ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేసి కూడా ఫైల్స్‌ను డిలీట్ చేయొచ్చు. ముందుగా మీ ఫోన్‌ను యూఎస్‌బీ కేబుల్‌తో కంప్యూటర్‌కు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్‌లో ఆటోప్లే ఆప్షన్స్‌ కనిపిస్తుంది. అందులో ఓపెన్‌ డివైజ్‌ టు వ్యూ ఫైల్స్‌ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. కంప్యూటర్‌లో మై కంప్యూటర్‌ లేదా దిస్‌ పీసీలోకి వెళితే ఫోన్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ మీకు ఫోన్‌ స్టోరేజ్‌ ఖాళీగా కనిపిస్తే.. ఫోన్‌లో యూఎస్‌బీ ఛార్జింగ్‌ దిస్‌ డివైజ్‌లో ఫైల్ ట్రాన్స్‌ఫర్‌ లేదా ట్రాన్స్‌ఫర్‌ ఫైల్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. తర్వాత కంప్యూటర్‌లో ఫోన్ ఐకాన్‌పై క్లిక్ చేసి డీసీఐఎమ్‌ ఫోల్డర్‌లోకి వెళ్లి కెమెరాపై క్లిక్ చేయాలి.

అందులో మీకు అవసరంలేని ఫైల్స్‌ను సెలక్ట్ చేసి డిలీట్‌ చేస్తే అవి మీ ఫోన్‌, కంప్యూటర్‌ నుంచి శాశ్వతంగా డిలీట్ అయిపోతాయి. మీ ఫోన్‌లోని డేటా సురక్షితంగా డిలీట్ చేయాలనుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here