Flash: విండీస్ ఆల్ రౌండర్ రస్సెల్ సంచలన కామెంట్స్

0
విండీస్ ఆల్ రౌండర్ రస్సెల్ మరోసారి సంచలన కామెంట్స్​ చేశాడు. కోచ్ ఫిల్‌ సిమ్మన్స్‌… తనను బలిపశువును చేసేందుకు ఆరోపణలు చేస్తున్నాడని రస్సెల్ వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.

వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు కోచ్ ఫిల్‌ సిమ్మన్స్‌, సీనియర్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ సోషల్​మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఇటీవల సిమ్మన్స్‌ మాట్లాడుతూ.. “జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం కంటే ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ప్రాధాన్యత ఇస్తున్నారు” అని అన్నాడు. అలానే టీమ్‌కు ఆడాలని ఎవరినీ అడగబోమని కీలక వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఆండ్రూ రస్సెల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. “ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. అయితే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు” అని ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇంగ్లాండ్‌ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్‌ టోర్నమెంట్‌’ సందర్భంగా మరోసారి ఆండ్రూ రస్సెల్‌ కీలక కామెంట్లు చేశాడు. తనను బలిపశువును చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తారని ముందే ఊహించానని చెప్పాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here