ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమెండ్ మాస్క్ దీని ఖరీదు ఎంతంటే

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డైమెండ్ మాస్క్ దీని ఖరీదు ఎంతంటే

0

బాగా ధనవంతులు ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి, వారు బంగారంతోనే కాదు వజ్రాలు ఖరీదైన డైమెండ్ వస్తువులు వాడుతూ ఉంటారు, అంతేకాదు నగలు మాత్రమే కాదు ఇంటికి కావాల్సిన వస్తువులు కూడా ఇలా వజ్రాలు బంగారంతో చేయించుకునే వారు ఉంటారు.

తాజాగా ఈ కరోనా సమయంలో మాస్కులు కూడా బంగారు పూత వేసినవి అలాగే వజ్రాలతో చేసినవి కూడా తయారు చేస్తున్నారు, వీటిని బాగా రిచ్ వారు కొంటారు అనేది తెలిసిందే, తాజాగా బంగారం, వజ్రాలతో ప్రపంచంలోనే ఖరీదైన మాస్క్ ను ఇజ్రాయేల్ జ్యువెలరీ సంస్థ తయారు చేసింది. ఆ మాస్క్ ధర 1.5 మిలియన్ డాలర్లు అని తెలిపింది.

మన కరెన్సీలో రూ.11.2 కోట్లు. మొత్తం 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఈ మాస్క్ పై 3600 తెలుపు, నలుపు రంగు వజ్రాలను పొదిగారు. ఎన్-99 ఫిల్టర్లను అమర్చారు. వైవెల్ జ్యువెలనీ కంపెనీ ఈ మాస్క్ ను రూపొందించింది. ఇక దీనిని చైనా వ్యాపారి ఆర్డర్ ఇచ్చారట, దానికి అనుగుణంగా దీనిని తయారు చేశారు.మొత్తం 270 గ్రాములుండే ఈ మాస్క్ సాధారణ సర్జికల్ మాస్క్ కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. దీనిని ఆర్డర్ ఇచ్చిన నాలుగు నెలలకు తయారు చేశారు, మొత్తానికి 25 మంది వర్కర్లు దీనిని తయారు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here