యమధర్మరాజు గురించి ఈ విషయాలు మీకు తెలుసా

యమధర్మరాజు గురించి ఈ విషయాలు మీకు తెలుసా

0

యముడు, పురాణాల్లో ఈ పేరుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది, మనుషులు పాపాలు చేస్తే ముందు యముడికి భయపడతారు, మన పాప పుణ్యాల లెక్కలు యమపురిలో తేల్చుతారు అని భయం కూడా చాలా మందికి ఉంటుంది, మరి అలాంటి యమధర్మరాజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

యముడిని యమధర్మరాజు అని పిలుస్తారు.. నరక లోకానికి అధిపతి. ఇక యముడు ఎవరో తెలుసా, ఆ సూర్యుని కుమారుడు… భూలోకంలో పాపుల పాపములను లెక్క వేస్తాడు, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని… యముడు దక్షిణ దిశకు అధిపతి అంటారు.

యముని చేతిలో ఉండే పాశమును కాలపాశము అని పిలుస్తారు. ఇక యమధర్మరాజు వాహనము దున్నపోతు.
యముడు నివశించే నగరం యమపురి, పాపుల చిట్టా చూసే పని ఆయన పక్కన ఉండే చిత్రగుప్తుడు చూసుకుంటాడు.
భూలోకంలో మొట్టమొదట మరణము పొంది, పరలోకమునకు వెళ్లిన వాడే యముడు అని పురాణాల్లో తెలిపారు

యముని బంధువులు ఎవరు అంటే
యముడికి సోదరులు : వైవస్వతుడు, శని
యముడికి సోదరీమణులు: యమున, తపతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here