ఏపీ ప్రతిష్ఠతను బ్రస్టు పట్టించిన వైసీపీ

ఏపీ ప్రతిష్ఠతను బ్రస్టు పట్టించిన వైసీపీ

0

ఆరునెలల్లో తాను మంచి సీఎం అనిపించుకుంటానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున చెప్పారని కానీ ఆయన 100 రోజులకే ఇంతకన్నా చెడ్డ ముఖ్యమంత్రి లేరని ఆయన నిరూపించుకున్నారని టీడీపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల ఎద్దేవాచేశారు.

తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఏపీలో ఆర్థిక కార్యకలాపాలను ముఖ్యమంత్రి జగన్ చావు దెబ్బ తీశారని యనమల విమర్శించారు… తన పాలనను ప్రజలు మెచ్చుకుంటారని జగన్ అనడం హస్యస్పదంగా ఉందని అన్నారు…

ఇటీవలే సింగపూర్ కు వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ ప్రతిష్ఠతను బ్రస్టు పట్టించారని వ్యాఖ్యానించారు… అమరావతికి నిధులు లేవంటూ తన విధానాన్ని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసిందని యనమల వ్యాఖ్యానించారు.