వైసీపీని మరింత ఇరుకున పెడుతున్న యనమల మీకు అంత సీన్ లేదు

వైసీపీని మరింత ఇరుకున పెడుతున్న యనమల మీకు అంత సీన్ లేదు

0

మొత్తానికి మూడు రాజధానుల విషయంలో సీఆర్డీయే బిల్లు సెలక్ట్ కమిటీ నిర్ణయం ఇవన్నీ నిన్నటి వరకూ పెద్ద ఎత్తున రచ్చకెక్కాయి.. తాజాగా ఈ బిల్లు సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు మండలి చైర్మన్ షరీఫ్, అయితే దీనిపై శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఈ సెలక్ట్ కమిటి నిర్ణయం ఏళ్లు కూడా పట్టవచ్చని యనమల అన్నారు.

సెలెక్ట్ కమిటీ కాలపరిమితి కనీసం మూడు నెలలని..అవసరమైతే పొడిగించవచ్చని తెలిపారు. ఇలా చేసినా కచ్చితంగా ప్రజల నుంచి ఏపీ అంతా వారు వివరాలు సేకరిస్తారు.. ఆ సమయం ఎంత అయినా పట్టవచ్చు అని చెప్పారు.. అంతే కాదు ఇలాంటి బిల్లు సెలెక్ట్ కమిటీలో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు.

గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్లను తిరస్కరించారని.. సుప్రీం తీర్పు ఇచ్చిందని యనమల గుర్తుచేశారు. మండలిని ప్రోరోగ్ చేయకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నేతలకు అవగాహన లేదు అని విమర్శించారు ఆయన. రూల్ 154 కింద చైర్మన్ విచక్షణాధికారాలను కోర్టులు ప్రశ్నించలేవని ఆయన అన్నారు, కోర్టుకు వెళ్లినా దీనిపై నెగ్గలేరు అని తెలిపారు, ఇక ఇటీవల మండలి రద్దు చేస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా కుదరని పని, మండలి రద్దు పై తీర్మానం మాత్రమే చేయగలరని పార్లమెంట్ ఆమోదించాలి… రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇవ్వాలని యనమల తెలిపారు. ఇవన్నీ అంత సులువుగా జరిగేవి కావు అని తెలిపారు ఆయన.