ప్రతిపక్షాల అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన యశ్వంత్‌ సిన్హా

0

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము నామిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా.. నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి నామినేషన్​ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here