పవన్ కు క్లాస్ పీకిన వైసీపీ

పవన్ కు క్లాస్ పీకిన వైసీపీ

0

ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వందరోజుల పాలన పూర్తి అయిన సంగతి తెలిసిదే. ఈ వందరోజుల పాలనపై ప్రధాన ప్రతిపక్ష టీడీపీ, బీజేపీలు మైక్ పట్టుకుని విమర్శలు చేయగా ఇదే క్రమంలో పవన్ కూడా తాజాగా విమర్శలు చేశారు. ఇందుకు సంబంధించిన ఒక నివేదికను కూడా విడుదల చేశారు…

ఇక ఆయన విడుదలు చేసిన నివేదికపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్నవన్ని పనిలేనివని కొట్టిపారేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజకీయంగా పవన్ అనుభవ రహితుడని చెప్పడానికి ఇటీవలే ఆయన మాట్లాడిన మాటలే నిదర్శనం అని అన్నారు…

రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ పోలవరం రివర్స్ టెండర్లు అయ్యేంతవరకు ఆగాలని బొత్స సూచించారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్రశ్నించాల్సిందిపోయి పవన్ తమ నాయకుడిని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు… చవకబారు ఉపన్యాసాల పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు తమవల్ల కావని బొత్స అన్నారు.