చంద్రబాబుకు వైసీపీ భారీ కౌంటర్

చంద్రబాబుకు వైసీపీ భారీ కౌంటర్

0

ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం ప్రతి విద్యార్థి హక్కు అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధన జరగాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు.

బలహీన వర్గాల వారిని ఇంకా ఎంత కాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు చంద్రబాబు నాయుడు అని విజయసాయిరెడ్డి అన్నారు..

చంద్రబాబు నాయుడు తుఫాను ఎక్కడ తీరం దాటేది తనకు ముందే తెలుసని అంటారని… హైదరాబాద్ ను నేనే నిర్మించా. నా విజన్-2020 డాక్యుమెంటును అబ్దుల్ కలామ్ కాపీ కొట్టారని అంటారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సూడోలాజియా ఫెంటాస్టికా అనే మానసిక రుగ్మత వల్లే ఇలా అయిపోయారు పాపం అని అన్నారు… తర్కానికందని కోతలు కోయడం దీని లక్షణం అని అన్నారు…