లోకేశ్ రాసిన లేఖకు వైసీపీ కౌంటర్

లోకేశ్ రాసిన లేఖకు వైసీపీ కౌంటర్

0

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారాలోకేశ్ ఇటీవలే ఏపీ స్పీకర్ ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే… ఆ మేరకు ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు…

ఈ లేఖపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది… ప్రస్తుతం నారాలోకేశ్ దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు… గతంలో స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత టీడీపీదని అన్నారు… వైసీపీ పార్టీపై గెలిచిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలను అప్పటి టీడీపీ ప్రభుత్వం సంతలో పశువులను కొన్నట్లు కొనిందని గుర్తు చేశారు…

దీనిపై చర్యలు తీసుకోలేని పరిస్థితిలో గత స్పీకర్ ఉండేవారని అన్నరు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయ చేస్తున్నారని అన్నారు… చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ మీద అవగాహన లేదని అన్నారు…